న్యూఢిల్లీ : ఆరు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి నిర్ధారణ అయినట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లోని పక్షులలో ఏవియన్ ఇన్ఫ్లూఎంజా సానుకూల నమూనాలు నిర్ధారణ అయినట్లు ప్రభుత్వం పేర్కొంది. కేరళ రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో వ్యాధి పీడిత పక్షులను నిర్మూలించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మరో వైపు కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. దరిమిలా క్రమక్రమంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది.