పూడిక తీస్తుంటే బైకు బయటకొచ్చింది..

పూడిక తీస్తుంటే బైకు బయటకొచ్చింది..

హైదరాబాద్ లోని నాలాలో పూడికతీత పనులు చేపట్టిన అధికారులు, కాలువ నుంచి ద్విచక్ర వాహనం బయట పడటంతో ఆశ్చర్యపోయారు.ముషీరాబాద్ పరిధిలోని ఇక్కడి బాప్టిస్టు చర్చి వీధిలో నాలాలో పూడికతీత పనులు చేపట్టారు.జేసీబీ యంత్రాలతో నాలాలో వ్యర్థాలను వెలికి తీస్తుండగా పూడికలో హీరో హోండా ఫ్యాషన్‌ (ఏపీ 09 ఈఈ 7703) బైక్ బయటకు వచ్చిందిదీన్ని చూసిన డీఈ ప్రసాద్‌, ఏఈ తిరుపతిలు, వాహనం గురించి ఆరా తీశారు. ఆపై మీడియాతో మాట్లాడుతూ మూడు నెలల క్రితం భారీ వర్షాలు పడినప్పుడు బైక్ నాలాలో పడి కొట్టుకుపోయిందని విషయమై సదరు వ్యక్తి నుంచి ఫిర్యాదు కూడా అందిందని చెప్పారు.వాహనాన్ని సంబంధిత వ్యక్తికి అందిస్తామన్నారు. నాలాలో టూ వీలర్ బయట పడిందని తెలుసుకున్న పలువురు స్థానికులు చూసేందుకు అక్కడికి తరలివచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos