కోర్టులో హత్య..19మంది జవాన్ల సస్పెండ్

కోర్టులో హత్య..19మంది జవాన్ల  సస్పెండ్

లఖ్నవూ: ఒక వ్యాపారి హత్యకు ప్రతీకారంగా నిందితుణ్ని న్యాయ స్థానంలోనే కాల్చి చంపిన ఘటనలో 18 మంది పోలీసుల్ని ప్రభుత్వం బుధవారం సస్పెండ్ చేసింది. హాజీ ఎహ్సాన్ అనే వ్యాపారి హత్య కేసు విచారణకు నిందితులు షెహనవాజ్ అన్సారీ, జబ్బర్లను మంగళ వారం బిజనూర్‌ చీఫ్‌ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు. అప్పుడు ముగ్గురు దుండగులు ఒక్కసారిగా న్యాయస్థానంలోకి ప్రవేశించి నిందితులపై కాల్పులు జరిపారు. షెహనవాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నిందితుడు జబ్బర్ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దుండగుల్ని అడ్డుకునే ప్రయత్నించిన పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos