లోక్‌సభ వాయిదా

లోక్‌సభ  వాయిదా

న్యూఢిల్లీ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)పై చర్చ జరగాలని లోక్‌సభ, రాజ్యసభలోని ప్రతిపక్ష ఎంపీలు పట్టుబడుతున్నారు. మంగళవారం కూడా పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఎస్‌ఐఆర్‌పై చర్చ జరగాలని డిమాండ్‌ చేస్తూ.. నిరసనలకు దిగారు. ప్రశ్నోత్తరాల సమయంలో కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. కానీ ప్రతిపక్షాలు నిరసనలు కొనసాగించడంతో స్పీకర్‌ ఓంబిర్లా సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.కాగా, రాజ్యసభలో బిజెపి ఎంపి జెపి నడ్డా ప్రతిపక్షాల నిరసనలను విమర్శించారు. ప్రతిపక్షాలు నిరసనలతో పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం అప్రజాస్వామికం అని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు.. రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే సభను తప్పుదోవ పటిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos