బిగ్‌బాస్‌ ఉచ్చులో పడకండి..

  • In Film
  • July 22, 2019
  • 157 Views
బిగ్‌బాస్‌ ఉచ్చులో పడకండి..

 విమర్శలు,ఆరోపణలు,నిరసనల మధ్య ఆదివారం బిగ్‌బాస్‌ తెలుగు మూడవ సీజన్‌ను ప్రారంభమైంది.మొత్తం 15 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ప్రవేశించగా మొదటిసారి భార్యభర్తలైన హీరో వరుణ్‌తేజ్‌,వితికా షేరులో కంటెస్టెంట్లుగా లోపలికి అడుగుపెట్టారు.ఈ నేపథ్యంలో వరుణ్‌,వితికా జంటపై సామాజిక మాధ్యమాల్లో సానుభూతి వ్యక్తమవుతోంది. వరుణ్ సందేశ్, వితికా షేరు ఇద్దరూ ఒకే సీజన్లో రావడం బిగ్గెస్ట్ మిస్టేక్ అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అమాయకమైన కపుల్ బిగ్ బాస్ ఉచ్చులో పడ్డారని, వీరి మధ్య గొడవ పెట్టి టీఆర్పీలు పెంచే ప్రయత్నం చేస్తారని, పాపం వీరు బలయ్యారు అంటూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నాురు.వరుణ్ సందేశ్, వితికా బిగ్ బాస్ ఇంట్లో గొడవ పడరని ఆశిస్తున్నాను. వాళ్ల మధ్య గొడవ పెట్టకండి బిగ్ బాస్ అంటూ కొందరు ఫ్యాన్స్ తమ మనసులోని మాటను బయట పెట్టారు. వరుణ్ సందేశ్, వితికా బిగ్ బాస్ సీజన్ 3లోకి ఎంటరయ్యారు. నేను వీరి విషయంలో కోరుకునేది ఒకటే… ఈ షో తర్వాత వారి మ్యారేజ్ విడాకులకు దారి తీయకుంటే చాలు, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో వారికి తెలుసో లేదో? ఇక్కడ ఎదురయ్యే పరిస్థితులు వారు ఎలా ఎదుర్కొంటారో చూడాలి…అంటూ ఓ నెటిజన్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos