మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత భారీ వ్యయంతో మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్ నిర్మాతగా దర్శకుడు సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన సైరా నరసింహారెడ్డి చిత్రం విడుదల వారం రోజులు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.గాంధీ జయంతి కానుకగా ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మళయాలం,కన్నడ భాషల్లో అక్టోబర్ 2న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. అయితే హిందీలో అదే రోజు హృతిక్ రోషన్ – టైగర్ ష్రాప్ కాంబినేషన్లో వస్తున్న ‘వార్‘ కూడా రిలీజ్ అవుతోంది. దీని వల్ల సైరా హిందీ వర్షన్కు థియేటర్లు దొరకడం లేదట. ఇదే విషయాన్ని ఫర్హాన్ అక్తర్.. రామ్ చరణ్కు చెప్పాడట. అంతేకాదు, సినిమాను వారం పాటు వాయిదా వేద్దామని కూడా కోరాడని సమాచారం.ఫరాన్ కోరికను లోకల్ డిస్టిబ్యూటర్లతో చెప్పిన తర్వాత రామ్ చరణ్ సినిమా వాయిదా వేయాలని డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.అక్టోబర్ 2కు బదులు అక్టోబర్ 8వ తేదీన సైరాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్మాత రామ్ చరణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎనిమిదో తేదీ నుంచి ఆదివారం వరకు వరుస సెలవులు ఉండడమే దీనికి కారణం అని అంటున్నారు..