ఒకప్పుడు పవన్‌కళ్యాణ్,మహేశ్‌బాబు,ఎన్టీఆర్,వెంకటేశ్ తదితర స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన భూమికా చావ్లా ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తక్కువ సమయంలోనే తెలుగు చిత్రపరిశ్రమలతో క్రేజీ హీరోయిన్‌గా మారిన భూమిక 2007లో భరత్ ఠాకూర్‌ను వివాహం చేసుకన్నారు.వివాహం తరువాత కూడా భూమిక పలు చిత్రాల్లో నటించినా అవేవి భూమిక ఎదుగుదలకు సహకరించలేకపోయాయి.భూమిక భర్త భరత్ ఠాకూర్ వ్యాపారాల్లో తీవ్రంగా నష్టపోవడంతో భూమిక కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో భూమిక తిరిగి నటిగా రాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ క్రమంలో టాలీవుడ్ కు కాస్త గ్యాప్ ఇచ్చి నాని ఎంసీఏ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఎంసీఏ, యూటర్న్ చిత్రాలు బాగానే ఆడడంతో అదే జోరు కొనసాగించాలని భూమిక భావిస్తోంది.తెలుగుతో పాటు తమిళ చిత్ర పరిశ్రమలో కూడా తనకు ఉన్న పరిచయాలతో అవకాశాలు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తోందట.సినిమా అవకాశాల కోసం భూమిక గ్లామర్ అస్త్రాన్ని కూడా ప్రయోగిస్తోంది. ఇటీవల తరచుగా ఫోటో షూట్స్ చేస్తోంది. తాజాగా భూమిక చేసిన ఫోటో షూట్ నెటిజెన్లని ఆకట్టుకుంటోంది. చాలా కాలం తర్వాత భూమిక హాట్ లుక్ లో కనిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. బ్లాక్ డ్రెస్ లో, ట్రెండీ లుక్ లో ఉన్న భూమిక ఫోటోలు వైరల్ అవుతున్నాయి. భూమిక చేస్తున్న ఈ ప్రయత్నం ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
