రాహులే అధ్యక్షుడిగా కొనసాగాలని తీర్మానం

న్యూఢిల్లీ:ఇక్కడ శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ అధ్యక్షులుగా రాహుల్ గాంధీయే కొనసాగాలని కోరినట్లు టీపీసీసీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అందరూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు ఆయన విలేఖరులకు తెలిపారు. మతతత్వ పార్టీలు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయని విమర్శించారు. ఈ దశలో రాహుల్ గాంధీ మాత్రమే కాంగ్రెస్ పార్టీని, దేశాన్ని కాపాడగలరని తేల్చి చెప్పారు. న్నారు. రాహుల్ గాంధీయే అధ్యక్షుడుగా కొనసాగాలని కోరుతూ నేతలంతా ఏకవాక్య తీర్మానం చేశారని కాంగ్రెస్ నేత కుసుమ కుమార్ తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం నేతల అభిప్రాయాల సమీకరణకు సీడబ్ల్యూసీ ఐదు బృందాల్ని నియమించింది. దరిమిలా రాత్రి ఎనిమిది గంటలకు మరోసారి సీడబ్ల్యూసీ సమావేశం కానుంది. అప్పుడు నేతల అభిప్రాయాల్ని సమితులు తెలపనున్నాయి. దరిమిలా అధ్యక్షుడి ఎంపిక గురించి తుది నిర్ణయాన్ని తీసుకొనే అవకాశం ఉంది. పార్టీ నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ నుంచి అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దూరం జరిగారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పీసీసీ చీఫ్లు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, ముఖ్యనేతలతో ఆ పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడీబ్ల్యూసీ) ఇవాళ ఉదయం సమావేశం అయ్యింది. సమావేశం ప్రారంభం కాగానే తల్లీ కుమారులిద్దరూ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం నుంచి బయటికి వెళ్లిపోయారు.ఈ సందర్భంగా సోనియా మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ తదుపరి అధ్యక్షుడి కోసం సంప్రదింపులు కొనసాగుతున్నాయి. సాధారణంగానే నేను, రాహుల్ ఇందులో భాగస్వాములం కాలేమ’ని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి దిగి పోవడం గురించి పునరాలో చించుకోవాలంటూ సీడబ్ల్యూసీ శనివారం మరోసారి చేసిన విన తిని రాహుల్ తిరస్కరించారు. తూర్పు, పడమర , ఉత్తర, దక్షిణా ప్రాంతాల నుంచి నాయకులతో వరుసగా సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, మన్మోహన్ సింగ్ మాట్లాడతారు. ఇక ఈశాన్య రాష్ట్రాలతో మాట్లాడే బాధ్యతలను అంబికా సోనీకి అప్పగించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos