న్యూఢిల్లీ: కన్నడ రచయిత భాను ముస్తాక్ అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ గెలుచుకున్నారు. హార్ట్ ల్యాంప్ అనే లఘ కథా రచనకు గాను ఆమెకు ఆ పురస్కారం దక్కింది. షార్ట్ స్టోరీ కలెక్షన్‌కు బూకర్ ప్రైజ్ దక్కడం ఇదే మొదటిసారి. భారతీయ ట్రాన్స్‌లేటర్ దీపా భస్తికి కూడా బూకర్ అవార్డు దక్కింది. భాను ముస్తాక్ రచనలకు అవార్డు ఇవ్వడం పట్ల జ్యూరీ రచయిత మ్యార్ పోర్టర్ స్పందించారు. అందమైన జీవిత కథలకు చెందిన రచనలు కన్నడ నుంచి వచ్చాయని, రాజకీయ.. సామాజిక అసాధారణ పరిస్థితుల్లో ఆ కథల్లో వర్ణించారని పోర్టర్ తెలిపారు. మహిళల జీవితాలు.. పునరుత్పత్తి హక్కులు, విశ్వాసాలు, కులం, అధికారం, అణిచివేతకు సంబంధించిన కోణంలో కథలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆంగ్ల భాష పాఠకులకు హార్ట్ ల్యాంప్ నిజంగానే కొత్త అనుభూతిని ఇస్తుందని పోర్టర్ చెప్పారు.