
నెల్లూరు:‘ నెల్లూరు వైకాపా అభ్యర్థులు పందెం మొనగాళ్లా?’అని జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మంగళవారం ఇక్కడ మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు.‘జెండా ఏ వైపు ఎగురుతాది అనే వాటి పైన కూడా బెట్టింగులు ఆడుతారు. వీళ్లకెందుకు రాజకీయాలు క్లబ్బుల్లో కూర్చుని పేకాట ఆడుకోండి. పోలీసులపైన కూడా రౌడీయిజం చేస్తారా?. జిల్లా తెదేపా, వైకాపా నాయకులు బెట్టింగుల కోసం కలలు కంటున్నారు. జనసేన నెల్లూరు గ్రామీణ అభ్యర్థి మనుక్రాంత్ రెడ్డి ఐటీ సంస్థను ప్రారంభించి పెట్టి ఉపాధి నిస్తున్నారు. నెల్లూరు నగర అభ్యర్థి వినోద్ రెడ్డి సమస్యలు పైన పోరాటం చేశాడు” అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ‘నారాయణని వదిలేదు లేదు. అందరికీ ఆయన మంత్రి నారాయణ ఏమో.. నాకు మాములు నారాయణ. రొట్టెల పండుగకు నన్ను రానివ్వకుండా అడ్డు కుంటారా? ఇది మా అమ్మ పుట్టినూరు. ఫతేఖాన్ పేట, మూలాపేట, టెక్కేమిట్టా. ఇలా ప్రతి చోటా నాకు కావాల్సిన మనుషులు ఉన్నారు” అని చెప్పారు. ‘నెల్లూరు వైకాపా గ్రామీణ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ నా అభిమాని అని చెప్తాడు. రెండు మూడు సార్లు కలిశాడు. బెట్టింగులు మానేసిన తర్వాత నా అభిమాని అని చెప్ప’ని హితవు పలికారు. పలు ఇంటర్వ్యూల్లో తాను పవన్ కల్యాణ్ అభిమానిని అని చెప్పిన అనిల్ తాను పవన్ అభిమానిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నానని ఒక సందర్భంలో మాధ్యమ ప్రతినిధులతో కూడా అన్నారు.