డేటింగ్‌ యాప్‌ వినియోగంలో బెంగళూరుకు రెండో స్థానం..

డేటింగ్‌ యాప్‌ వినియోగంలో బెంగళూరుకు రెండో స్థానం..

స్మార్ట్‌ మొబైళ్లు,సామాజిక మాధ్యమాల ప్రభావంతో ప్రస్తుత ఆధునిక యుగం మొబైల్‌ యాప్‌ యుగంగా మారిపోయింది.పదేళ్ల పిల్లల నుంచి పండు ముసలోళ్ల వరకు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ మొబైల్‌ ఉంటోంది.ఇక పరుగులు పెట్టే వయసులో ఉన్న యువత ఊరికే ఉంటుందా?అంతర్జాలంలో కనిపించే ప్రతి యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకొని వాడేస్తున్నారు.అన్నిటికంటే ఎక్కువగా యువత ఇతర వ్యక్తులతో స్నేహాలు పెంచుకోవడానికి ఆసక్తి కనబరుస్తుండడంతో అంతర్జాలంలో వందల కొద్దీ కొత్త యాప్‌లు పుట్టుకొస్తున్నాయి.ఈ క్రమంలో వాట్సాప్‌ ఇప్పటికే ప్రతి ఒక్కరికీ చేరువ కాగా టిక్‌టాక్‌ యాప్‌కు కూడా ఆదరణ దక్కుతోంది.టిక్‌టాక్‌ వల్ల ఇప్పటికే ఎన్నో అనర్థాలు చోటు చేసుకున్నా యువతలో టిక్‌టాక్‌పై ఉన్న క్రేజ్‌ మాత్రం తగ్గడం లేదు.ఇక డేటింగ్‌ యాప్‌ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేమో అనిపిస్తుంది.అన్ని రంగాల్లో పాశ్చాత్య దేశాలతో పోటీ పడుతున్న భారతదేశం డేటింగ్‌ యాప్‌ల వినియోగంలో సైతం పోటీ పడుతోంది.ఇక సిలికాన్‌ సిటీగా,ఫ్యాషన్‌కు రెండో ప్యారిస్‌గా ప్రపంచ ఖ్యాతి గడించిన బెంగళూరు నగరం డేటింగ్‌ యాప్‌ వినియోగంలో రెండో స్థానం నిలిచింది.ఉద్యోగాలు,వ్యాపారాలు,చదువు ఇలా అనేక కారణాలతో ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి సైతం యువతీయువకులు బెంగళూరు నగరానికి వలస రావడంతో బెంగళూరు అన్ని రాష్ట్రాల,దేశాల ప్రజలకు నివాసంగా మారింది.ఈ క్రమంలో కొత్త వ్యక్తులతో పరిచయం కోసం బెంగళూరు యువత డేటింగ్‌ యాప్‌ల వైపు ఆసక్తి కనబరుస్తుండడంతో బెంగళూరు నగరం డేటింగ్‌ యాప్‌ల వినియోగంలో రెండో స్థానంలో నిలిచింది.యాప్‌ల నిపుణులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.కాగా ఇటువంటి యాప్‌ల వల్ల చాలా ప్రమాదాలు పొంచి ఉంటాయని కొన్నిసార్లు యాప్‌ నిర్వాహకులు లేదా యాప్‌ల ద్వారా పరిచయమయ్యే వ్యక్తుల నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇటువంటి యాప్‌ల వల్ల దేశ యువత పాశ్చాత్య సంస్కృతికి మరింత ప్రభావితులవురానే ఆందోళన వ్యక్తమవుతోంది..

  

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos