అమరావతి: రాజధాని నగరం అమరావతిలో30,000 ఎకరాల స్థలం చంద్రబాబు బినామీలు, బంధుగణం చేతిలోనే ఉందని వైకాపా ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి గురువారం ట్విట్టర్లో ఆరోపించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా ఈ భూమిని చంద్రబాబు వారికి కట్ట బెట్టారని వివరించారు. త్వరలో వీరంతా రోడ్డున పడతారని చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. అందుకే ‘అమరావతిని ఖూనీ చేశారు. రియల్ ఎస్టేట్ ధరలు పతనమయ్యాయి’ అంటూ ఆయన గింజుకుంటున్నారని వ్యాఖ్యానించారు.