వచ్చే ఐపీల్ కు కూడా చెన్నై పరిస్థితి ఇంతేనా ?

  • In Sports
  • November 5, 2020
  • 213 Views
వచ్చే ఐపీల్ కు కూడా చెన్నై పరిస్థితి ఇంతేనా ?

ఐపీఎల్ 2020 ముగింపు దశకు వచ్చేసింది. దీంతో ఈ సీజన్లో ప్లేఆఫ్ చేరని ఫ్రాంచైజీలు అప్పుడే వచ్చే సీజన్‌పై దృష్టి సారించాయి. కరోనా కారణంగా ఐపీఎల్ 2020 ఆలస్యం కాగా.. వచ్చే సీజన్ మాత్రం యథాతథంగా ఏప్రిల్ లేదా మే నెలలో నెలలో భారత్‌లోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ మధ్యలోనే ఐపీఎల్ వేలం జరగనుంది.ఈ సీజన్లో ఆకట్టుకోలేకపోయిన చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ వేలంపై ఆశలు పెట్టుకుంది. వయసు మీద పడిన ఆటగాళ్లను తప్పించి.. వారి స్థానంలో యువకులను జట్టులోకి తీసుకోవాలని చెన్నై భావిస్తోంది. జట్టును మొత్తం ప్రక్షాళన చేసే యోచనలో సీఎస్‌కే ఉంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కూడా ఆటగాళ్ల వేలం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.షేన్ వాట్సన్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా… కేదార్ జాదవ్, పియూష్ చావ్లా, కర్ణ్ శర్మ, మురళీ విజయ్ లాంటి ఆటగాళ్లను చెన్నై రిలీజ్ చేసే అవకాశం ఉంది. కానీ చెన్నై ప్లాన్లు బీసీసీఐపై ఆధారపడి ఉన్నాయి. వచ్చే ఏడాది సీజన్ కంటే ముందు ఆటగాళ్ల మెగా వేలం జరుగుతుందా లేదా మినీ వేలం జరుగుతుందా అనేది బీసీసీఐ తేల్చాల్సి ఉంది.వాస్తవానికి వచ్చే సీజన్‌కు ముందు మెగా ఆక్షన్ నిర్వహిస్తారని గతంలొ వార్తలొచ్చాయి. కానీ కోవిడ్-19 కారణంగా మెగా వేలం యోచనను బీసీసీఐ విరమించుకున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే మినీ వేలానికి పరిమితం కావాల్సి ఉంటుంది. ఐపీఎల్ వేలం విషయమై తాము ఇప్పటి వరకూ నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ తెలిపాడు. ఈ సీజన్ ముగిశాక ఓ నిర్ణయానికి వస్తామన్నాడు.వచ్చే సీజన్‌ను ఇండియాలోనే నిర్వహించాలని భావిస్తున్నామని చెప్పిన గంగూలీ కుదరకపోతే యూఏఈలో నిర్వహిస్తామన్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos