హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై సంచలన నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల కోటా పరిమితి ఎత్తివేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ కోసం ప్రత్యేక జీఓలు జారీ చేసేందుకు సిద్ధం అవుతుంది. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285(A)ను సవరణ చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది.