బ్యాట్స్‌మన్‌ కాదు, బ్యాటర్…ఎంసీసీ కీలక నిర్ణయం

  • In Sports
  • September 22, 2021
  • 135 Views
బ్యాట్స్‌మన్‌ కాదు, బ్యాటర్…ఎంసీసీ కీలక నిర్ణయం

క్రికెట్‌లో లింగ‌భేదానికి తావు లేకుండా మెరిల్‌బోన్ క్రికెట్ క్ల‌బ్ (ఎంసీసీ) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు పురుష క్రికెటర్లను మాత్రమే సంబోధించే బ్యాట్స్‌మన్‌  అనే పదాన్ని తొలగించి మహిళలు, పురుషులకు సమానంగా వర్తించేలా బ్యాటర్ అన్న పదాన్ని తక్షణమే అమల్లోకి తేవాలని బుధవారం ప్రకటించింది. గత కొంత కాలంగా ఈ ప్రతిపాదన ఎంసీసీ పరిశీలనలో ఉండగా.. తాజాగా ఆమోదించింది.
లింగ భేదం లేని పదాన్ని ఉపయోగించడం వల్ల క్రికెట్ అందరి క్రీడ అని మరోసారి నిరూపితమవుతుందని ఎంసీసీ విశ్వసిస్తోంది. లింగ భేదం లేని పదాలు వాడటం వల్ల మరింత మంది మహిళలు క్రికెట్ పట్ల ఆకర్షితులవుతారని అభిప్రాయపడింది. అయితే లింగ భేదానికి ఆస్కారముండే థర్డ్ మ్యాన్, నైట్ వాచ్‌మన్‌, జెంటిల్‌మన్‌ వంటి పదాలపై ఎంసీసీ ఎలాంటి కామెంట్లు చేయకపోవడం విశేషం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos