డ్రా చేస్తారా…చేతులెత్తేస్తారా…!

  • In Sports
  • February 8, 2021
  • 184 Views
డ్రా చేస్తారా…చేతులెత్తేస్తారా…!

చెన్నై: ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. 420 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 12 పరుగులు మాత్రమే చేసిన ఓపెనర్ రోహిత్ శర్మ జాక్ లీచ్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ప్రస్తుతం శుభ్‌మన్‌ గిల్ 15, పుజారా 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత జట్టు విజయానికి ఇంకా 381 పరుగులు అవసరం కాగా, చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. అంతకుముందు నాలుగో రోజు ఉదయం 257/6తో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు 337 పరుగులకు ఆలౌట్ అయింది. వాషింగ్టన్ సుందర్ 85 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. జట్టులో పంత్ (91) తర్వాత టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పుజారా 73 పరుగులు చేశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌కు ఈసారి బౌలర్లు చుక్కలు చూపించారు. ఇన్నింగ్స్ తొలి బంతికే రోరీ బర్న్స్‌ను వెనక్కి పంపిన అశ్విన్ ఆ తర్వాత కూడా చెలరేగిపోయాడు. ఆరు వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. నదీం రెండు, ఇషాంత్, బుమ్రా చెరో వికెట్ తీసుకున్నారు. దీంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 178 పరుగుల వద్ద ముగిసింది. ఇంగ్లిష్ జట్టులో రూట్ చేసిన 40 పరుగులే అత్యధికం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos