బెళగావి: ఇక్కడి శ్రీ గురు మదివాలేశ్వర్ మఠ్కు చెందిన బసవ సిద్ధలింగ స్వామి ఉరి వేసుకుని ప్రాణం తీసుకున్నాడు. పోలీసులకు ఆత్మహత్య లేఖ లభించింది. అందులో ఏముందనేది వెల్లడించలేదు. తన నివాసంలోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడ పోలీసులు తెలిపారు. మఠాలలో జరుగుతున్న లైంగిక దాడుల గురించి ఒక వీడియోను విడుదలైంది. అందులో బసవ సిద్ధలింగ పేరు కూడా ప్రస్తావన వచ్చింది. దీంతో ఆయన మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుచరులు అనుమానించారు.