సమాజ్‌వాదీ పార్టీ ఎంపీపై దేశద్రోహం కేసు

సమాజ్‌వాదీ పార్టీ ఎంపీపై దేశద్రోహం కేసు

లక్నో: తాలిబాన్లను భారత స్వాతంత్ర్య సమరయోధులతో పోల్చిన సమాజ్‌వాదీ పార్టీ లోక్‌సభ సభ్యుడు షఫీఖర్ రహ్మాన్ బార్క్, మరో ఇద్దరిపై పోలీసులు దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. తాలిబాన్లను భారత స్వాతంత్ర్య సమరయోధులతో పోల్చి వారి విజయోత్సవాన్ని జరుపుకున్నారని చంబల్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ చార్ఖేష్ మిశ్రా చెప్పారు. ‘‘భారత ప్రభుత్వం ప్రకారం తాలిబాన్ ఒక ఉగ్రవాద సంస్థ. తాలిబాన్లపై చేసిన వ్యాఖ్యలు రాజద్రోహంగా పరిగణించవచ్చు. మేం ఎఫ్ఐఆర్ నమోదు చేశాం’’ అని తెలి పారు. ‘‘అఫ్ఘనిస్తాన్ స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటున్నాను, వారు దేశాన్ని నడపాలనుకుంటున్నారు’’ అని సమాజ్‌వాది పార్టీకి చెందిన షఫీఖర్ బార్క్ విలేకరులతో అన్నా రు. ఈ వ్యాఖ్యను ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తీవ్రంగా ఖండించారు. కాబూల్ పతనం తర్వాత పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యతో ఎంపీ వ్యాఖ్య లను పోల్చారు. సమాజ్ వాదీ పార్టీలో ఏదైనా జరగవచ్చు. ‘‘జన గణ మన’’ పాడలేని వ్యక్తులు ఉన్నారు… ఎవరైనా తాలిబాన్లకు మద్దతు ఇవ్వవచ్చు, మరికొందరు ఉగ్రవాదులు పట్టుబడిన తర్వాత పోలీసులపై ఆరోపణలు చేయవచ్చు .’’అని వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos