న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరో విడత ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసే ప్రణాళికతో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో ఏడు పెద్ద బ్యాంకులు, ఐదు చిన్న బ్యాంకులు పని చేస్తున్నాయి. మరో విడత విలీనంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను 4-5 కు కుదించాలన్నది ప్రభుత్వ యోచనగా వుందని అధికార వర్గాలు తెలిపాయి. భవిష్యత్తు ప్రణాళికను రూపొందించే ముందు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ , భాగస్వాములను సంప్రదించనున్నట్టు చెప్పాయి. 2017కు ముందు ప్రభుత్వ రంగంలో 27 బ్యాంకులు ఉండేవి. వాటి సంఖ్య ఇప్పుడు 12కు తగ్గింది.