బంజారా భాష కోసం పుట్టుకొచ్చిన కొత్త చిత్ర పరిశ్రమ..

  • In Film
  • October 6, 2020
  • 209 Views
బంజారా భాష కోసం పుట్టుకొచ్చిన కొత్త చిత్ర పరిశ్రమ..

ఇండియాలో బాలీవుడ్.. టాలీవుడ్.. కోలీవుడ్.. శాండిల్ వుడ్ ఇలా భాషకు ఒక సినిమా పరిశ్రమ ఉంది. సౌత్ లో ఉన్న నాలుగు సినిమా పరిశ్రమలు మరియు ఉత్తరాదిన బాలీవుడ్ తో పాటు పలు సినిమా పరిశ్రమలు ప్రతి ఏడాది వందల సినిమాలను విడుదల చేస్తున్నాయి. ఈ సమయంలోనే దేశంలో ఉన్న 15.5 కోట్ల మంది బంజారాల కోసం ఎందుకు ఒక సినిమా పరిశ్రమ మొదలు పెట్టవద్దని బంజారా సినిమా మేకర్స్ అభిప్రాయానికి వచ్చారు. తమ బంజారాల కోసం ఒక సినిమా పరిశ్రమ ఉండాలనే ఉద్దేశ్యంతో ‘బంజారావుడ్’ అంటూ మొదలు పెట్టారు. గోర్ జీవన్ సినిమాతో గుర్తింపు దక్కించుకున్న కెపిఎస్ చౌహాన్ తన బంజారా ప్రజల కోసం ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొన్నాడు.నాలుగు కోట్ల మంది మాట్లాడే కన్నడ భాషకు సినిమా పరిశ్రమ ఉంది.. పది కోట్ల మంది మాట్లాడే తెలుగు భాషకు సినిమా పరిశ్రమ ఉంది.. తక్కువ మంది మాట్లాడే భోజ్పురి భాషకు సినిమా పరిశ్రమ ఉంది. మరి 15.5 కోట్ల మంది మాట్లాడే బంజారా కు మాత్రం ఎందుకు సినిమా పరిశ్రమ ప్రత్యేకంగా ఉండకూడుదు అనే ఉద్దేశ్యంతో దీనిని ప్రారంభిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. బంజారా సినిమాలకు థియేటర్ల సమస్య వస్తుంది. అందుకే బంజారా సినిమాల కోసం ఒక ప్రత్యేకమైన ఓటీటీ ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేస్తున్నాం. అందులో బంజారా భాషలో సినిమాలు వెబ్ సిరీస్ మరియు షోలు ఉంటాయని పేర్కొన్నారు.బంజారా ప్రజలందరు కూడా ఫోన్ లోనే బంజారా సినిమాలను వీక్షించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బంజారావుడ్ ప్రారంభోత్సవంను భారీ ఎత్తున నిర్వహించాలని భావించినా కూడా కరోనా కారణంగా కొద్ది మంది సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించామన్నాడు. బంజారా కళాకారులకు ఇది చక్కని వేదిక అవుతుందని దేశ వ్యాప్తంగా ఈ విషయమై ప్రచారం చేయబోతున్నామన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos