న్యూ ఢిల్లీ: కేసీఆర్ ప్రభుత్వ అక్రమాల పై విచారణకు న్యాయస్థానాల్లో వ్యాజ్యాల్ని దాఖలు చేస్తామని తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారుర. సోమ వారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘కేసీఆర్ అవినీతి చిట్టా మా చేతిలో ఉంది. రిజిస్ట్రేషన్ల నిలిపివేతతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేల అక్రమాలు, అవినీతిని బయటపెడతాం. కేసీఆర్ అవినీతిపై సాక్ష్యాలతో సహా కోర్టులో పిటిషన్ వేస్తామ’ని వివరించారు.