ముంబై: ‘జత అరటి పండ్ల’తో బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్ ను ఐదు నక్షత్రాల హోటల్ పెద్ద దెబ్బ కొట్టింది. ట్విట్టర్లో ఆయన స్వయంగా ఈ నిజాన్ని వెల్లడించారు. రాహుల్ రెండు రోజుల కిందట చలన చిత్రం చిత్రీకరణకు కోసం ఛండీఘడ్కు వెళ్లారు. అప్పుడు అక్కడి ఒక ఐదు నక్షత్రాల హోటల్లో బస చేశారు. జిమ్కు వెళ్లోచ్చిన తర్వాత రెండు అరటి పళ్ల కోసం హోటల్ కు ఆర్డరి చ్చారు. కాసేపటికి సిబ్బంది అరిటి పళ్లు, సంబంధిత బిల్లు కూడా చేతిలో పెట్టారు. దాన్ని చూడగానే దిగ్బ్రాంతికి గురయ్యారు. రెండు అరటి పళ్ల వెల రూ. 442 కావటమే. దీంతో పళ్లు కూడా జేబు ఆరోగ్యానికి హాని చేస్తాయి అనే అర్ధం వచ్చేలా రాహుల్ ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.