ఫీజులుగా డబ్బుకు బదులు కొబ్బరి బొండాలు..

ఫీజులుగా డబ్బుకు బదులు కొబ్బరి బొండాలు..

పలు దేశాల ఆర్థిక వ్యవస్థల్ని తీవ్రంగా దెబ్బ తీసిన ఈ మాయదారి వైరస్ పుణ్యమా అని ఇటీవల కాలంలో ఎప్పుడూ చూడని ఎన్నో కొత్త అంశాల్ని తెర మీదకు తీసుకొస్తోంది. తాజాగా అలాంటి పరిస్థితే ఇండోనేసియాలోని బాలీ ద్వీపంలో నెలకొంది. బాలీ పేరు విన్నంతనే అద్భుతమైన బీచ్ లతో.. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకలు పెద్ద ఎత్తున వస్తుంటారు.కరోనా కారణంగా టూరిజం మీద ఆధారపడిన దేశాలు భారీ ఎత్తున నష్టపోయాయి. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లోకి చిక్కుకుపోయాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితే బాలీ ద్వీపంలో నెలకొంది. నెలల తరబడి టూరిజం పూర్తిగా మూతపడిపోవటం.. ఎప్పటికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్నది చెప్పలేని పరిస్థితి. దీంతో.. అక్కడి వారికి పూట గడవటమే కష్టంగా మారింది. ఇలాంటి వేళ.. కాలేజీ ఫీజులు చెల్లించటం సాధ్యం కాని పనిగా మారింది. ఇలాంటివేళ.. సదరు కాలేజీలు వినూత్నంగా ఆలోచించాయి. విద్యార్థులు తమ ఫీజుల్ని నగదురూపంలో కాకుండా వస్తు రూపంలో చెల్లించొచ్చని పేర్కొన్నాయి. కాలేజీ ఫీజులకు బదులుగా కొబ్బరి బోండాలు ఇవ్వొచ్చని చెప్పారు. దీనికి స్పందన వస్తోంది. దీంతో.. మరో అడుగు ముందుకు వేసిన కాలేజీ యాజమాన్యాలు కొబ్బరి బోండాలతో పాటు.. సహజ సిద్ధమైన ఉత్పత్తుల్ని ఫీజులకు బదులుగా ఇవ్వొచ్చని చెబుతున్నాయి. ఈ నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos