బెంగళూరు : పునీత్ రాజ్ కుమార్ భౌతికకాయాన్ని చూసిన నటుడు బాలకృష్ణ బాలయ్య తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టుకున్నారు. పునీత్ అన్నయ్య శివ రాజ్ కుమార్ బాలయ్యను హత్తుకున్నారు. అక్కడున్నంత సేపు బాలయ్య కళ్లు తుడుచుకుంటూనే ఉన్నారు. ఇదే సమయంలో పునీత్ భార్యను కూడా బాలయ్య పరామర్శించారు. అభిమానుల సందర్శనార్థం నగరంలోని కంఠీరవ క్రికెట్ స్టేడియంలో పునీత్ పార్థివదేహాన్ని ఉంచారు. ఆయనను చివరిసారి చూసుకునేందుకు వేలాది మంది స్టేడియంకు తరలి వస్తున్నారు.