ముంబై : మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని అక్కడి నుంచి తప్పించి రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రాకు ఆ బాధ్యతల్ని అదనంగా అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ‘మహా’ రాజకీయ నాటకంలో గవర్నర్ కోశ్యారీపై అనేక విమర్శలు వెల్లు వెత్తింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీకి ఇచ్చిన గడువు ముగియకముందే కోశ్యారీ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడం విమ ర్శలకు దారి తీసింది. ఆ తర్వాత భాజపాకు మద్దతిస్తానంటూ ఎన్సీపీ నేత అజిత్ పవార్ ముందుకు రావడంతో రాత్రికి రాత్రే రాష్ట్ర పతి పాలన ఎత్తివేసి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ భాజపాను ఆహ్వానించి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్చే ప్రమా ణాన్ని చేయించటం ‘క్షణా’ల్లో జరిగాయి