కుల మతాలకు అతీతంగా దేశం నిలవాలి

కుల మతాలకు అతీతంగా దేశం నిలవాలి

కడప:ప్రపంచంలో భారత్ కుల మతాలకు అతీతంగా నిలవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్బి అంజాద్బాష ఆశించారు. సోమవారం బక్రీద్ పర్వదినాన ఇక్కడి మామిళ్లపల్లె హలీమా సాదియా మసీద్ మైదానంలో జరిగిన ఈదుల్ జుహా ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ‘నేడు ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించు కుంటున్నారు. రాష్ట్రంలో మంచి వానలు పడి రైతాంగం అభివృద్ధి చెందాలి. వ్యవసాయం బాగుంటేనే రాష్ట్రం కూడా బాగుటుంది. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించి తమ వ్యాపార లావాదేవీలను బాగా చేయాలని అల్లాను ప్రార్థించాన’ని చెప్పారు. ప్రజలందరూ సుఖ సంతో షాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని అల్లాను ప్రార్థించి నట్లు ముస్తి రహీమ్ ఉల్లాఖాన్ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos