అమరా వతి: శాసన మండలి రద్దు తీర్మానాన్ని దిగువ సభలో జనసేన సభ్యుడు రాపాకా వర ప్రసాద్ సమర్థించారు. ఎగువ సభ రద్దు గురించి జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ‘మండలి పై తెదేపా దొంగాట ఆడుతోంది. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్ట డమే చంద్రబాబు పని. పాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందే. అభివృద్ధి వికేంద్రీకరణ 13 జిల్లా లకు విస్తర ణకు ప్రవేశ పెట్టిన ముసాయిదాను మండలిలో అడ్డుకోవడం దురదృష్టకరమ’ని వ్యాఖ్యానించారు. మండలిలో ఆంగ్ల మాధ్య మం బిల్లు, ఎస్సీ,ఎస్టీ కమిషన్ల బిల్లులను అడ్డుకున్నారని తప్పుబట్టారు.విడదీసి పాలించడమే చంద్రబాబు నైజమని విమర్శించారు. శాసనసభలో మేధావులు, రాజకీయ ఉద్దండులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులున్నందున ఎగువ సభ అనవసరమన్నారు.