హొసూరు : ఇక్కడికి సమీపంలోని అటవీ ప్రాంతంలో తల్లి నుంచి విడిపోయి గ్రామాల వైపు వచ్చిన ఏనుగు పిల్ల అనారోగ్యంతో మృతి చెందింది. వారం రోజుల క్రితం సానమావు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగుల మంద నుంచి పిల్ల ఏనుగు దారి తప్పి సమీపంలోని గ్రామాల వైపు రావడంతో స్థానికులు ఆందోళన చెందారు. గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు ఏనుగు పిల్లకు మత్తు ఇంజక్షన్ వేసి తల్లి వద్దకు చేర్చారు. పిల్ల ఏనుగు మళ్లీ తల్లి నుంచి విడిపోయి సమీపంలోని అటవీ ప్రాంత గ్రామాల వైపు సంచరిస్తూ ఉండేది. తల్లి నుంచి విడిపోయినప్పటి నుంచే ఏనుగు పిల్ల దిక్కుతోచక అనారోగ్యం పాలైంది. ఈ నేపథ్యంలో దాని కళేబరాన్ని చూసిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు గుట్టు చప్పుడు కాకుండా ఖననం చేసినట్లు సమాచారం.