పతనమైన బాబు

పతనమైన బాబు

అమరావతి: సామాజిక మాధ్యమాల్లోని సమాచారాన్ని వినిపించే స్థాయికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగిపోయారని మాజీ మంత్రి, వైకాపా నేత రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. శుక్రవారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. ‘సామాజిక మాధ్యమాల్లో వైకాపా తమకు వ్యతిరేకంగా నీచంగా ప్రచారం చేస్తున్నారని చంద్ర బాబు నాయుడు చేసిన ఆరోపణను తప్పు బట్టారు.‘సామాజిక మాధ్యమం పెద్ద కీకారణ్యం . అందు లోని ఏదో ఒక సమాచారాన్ని చదివి వినిపించే స్థాయికి చంద్ర బాబు నాయుడు పతనమయ్యార’న్నారు.మాధ్యమాన్ని అడ్డు పెట్టుకుని సొంత మామ పైనే దుర్మార్గంగా దుష్ప్రచారం చేయించిన ఘనత చంద్ర బాబు నాయుడిదని ధ్వజమెత్తారు. అలాంటి నీచ సంస్కృతికి మర్రి చెట్టుకు చంద్ర బాబు నా యు డు విత్తనంలాంటి వాడని అభివర్ణించారు. గత పదేళ్లుగా వైఎస్ కుటుంబీకులపై సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియాలో దుష్ప్రచా రాన్ని చేయించేందుకు తెదేపా రెండు వేల మందితో ఒక ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసుకుందని ఆరోపించారు. ఈ పనులకు హైదరాబాద్లోని ఎన్ బీకే బిల్డిం గ్, విజయవాడ సామాజిక మాధ్యమ కార్యాలయాలు వేదికలని వివరించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక, ప్రజలకు ఏమాత్రం సంబంధంలేని విషయాలను మాట్లాడుతున్నారని మండి పడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos