రాజమండ్రి: సిఐడి అధికార్లు ఇక్కడి కేంద్ర కారాగారంలో తేదేపా అధినేత చంద్రబాబు నాయుడు విచారణ ప్రారంభించారు. సీఐడీ డీఎస్పీ ఎం.ధనుంజయుడు నేతృత్వంలో 12 మంది అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. శనివారం ఉదయం చంద్రబాబుకు ప్రత్యేక వైద్య బృందం ఆరోగ్య పరీక్షల్ని చేసింది. ఉదయం 9.30 గంటలకు ఆరంభమైన విచారణ సాయంత్రం 5 గంటల విచారణ కొనసాగనుంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు భోజన విరామం ఉంటుంది. ప్రతి గంటకూ చంద్రబాబుకు 5 నిమిషాల పాటు విశ్రాంతి నిస్తారు. చెరసాల రెండంచెల భద్రత ఏర్పాటు చేశారు. సీఐడీ డీఎస్పీ ఎం.ధనుంజయుడు నేతృత్వంలో 12 మంది సీఐడీ అధికారులు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు.