అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడును ఉండవల్లిలోని ఆయన నివాసంలోనే బుధవారం పోలీసులు నిర్బంధించారు. తెదేపా పిలుపు నిచ్చిన ‘ఛలో ఆత్మకూరు’ ఆందోళనకు అనుమతి నిరాకరించిన పోలీసులు బాబుపై ఈ మేరకు చర్య తీసుకున్నారు. ‘ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తున్నందుకు చంద్ర బాబు నాయుడును మేము ఆయన గృహంలో బంధించ లేదు. చంద్ర బాబు నాయుడు పల్నాడుకు వెళితే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశ ముంది. అందువల్ల ముందస్తుగా నేతను నిర్బంధించామని’ పోలీసు డైరెక్టర్ జనరల్ గౌతం సవాంగ్ ఇక్కడ విలేఖరులకు వివరించారు.