కార్యకర్తల్ని కాపాడుకుంటాం

కార్యకర్తల్ని కాపాడుకుంటాం

గుంటూరు:‘తెదేపా మనుగడకు కార్యకర్తలు చాలా అవసరం. వారిని  కాపాడుకుంటాం’అని పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం ఇక్కడి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యకర్తలు, నాయకుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘ ‘ఇక పై గుంటూరు నుంచే రాష్ట్ర కార్య కలాపాలు జరుగుతాయి. కొత్త కార్యాలయం సిద్ధమయ్యేవరకు ఎక్కడ్నుంచో పని చేసే కన్నా గుంటూరే సులభం. తెదేపాకు చరిత్ర ఉంది. మళ్ళీ మనపై బాధ్యతలు పెరిగాయి. 40 శాతం ఓట్లను వేసిన ప్రజల కోసం పని చేయాలి. నీతి వంతమైన పాలన ఇచ్చాం. 33వేల ఎకరాల భూమిని మనపై నమ్మకంతో రైతులు ఇచ్చారు. రాజకీయ పార్టీ మనుగడకు కార్యకర్తలు చాలా అవసరం. 37 ఏళ్ళ పాటు పార్టీని, జెండాని మోసింది కార్యకర్తలే. పార్టీ వల్ల నష్ట పోయినా కార్యకర్తలు పార్టీలోనే కొనసాగుతున్నారు. పార్టీకి మూల స్తంభాలు కార్యకర్తలే . ప్రజలు, పార్టీ కార్యకర్తలపై దాడులు పెరిగాయి. మన కార్యకర్తలు ఇప్పటి వరకూ ఆరుగురు చనిపోయారు. ప్రతి కార్యకర్తని కాపాడుకుంటాం. ఇక్కడే ఉంటాను. మీకు అండగా ఉంటా. మనం తప్పు చేయలేదు. అరాచకాలు చేయలేదు’ అని నేతలు, కార్యకర్తలకు ధైర్యాన్ని నూరి పోసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos