విజయవాడ : 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలో జరుగుతున్న పంద్రాగస్టు వేడుకల్లో మంత్రులతో పాటు, చంద్రబాబు భార్య భువనేశ్వరి పాల్గొన్నారు.