పదవి పై ఆశ లేదు: మోహన్‌ బాబు

హైదరాబాద్: తాను పదవి ఆశించి వైకాపాలో చేరలేదని సినీ నటుడు మోహన్‌ బాబు పేర్కొన్నారు. వైకాపాలో చేరిన తర్వాత మంగళవారం ఇక్కడ మాద్యమ ప్రతినిధులతో మాట్లాడారు. తెలుగు ప్రజల మేలు కోసమే వైసీపీలో చేరినట్లు చెప్పారు.ఫీజు రీయింబర్స్మెంట్పై చంద్రబాబుతో ఎన్నోసార్లు మాట్లాడాను. ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇంకా రూ. 19 కోట్లు రావాలి. మూడు విడతల్లో ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తామని చేయలేదు. కాపు విద్యార్థులకు రావాల్సిన రూ.2 కోట్లు ఇవ్వలేదు. తమ పార్టీలో చేరాలని జగన్ మూడేళ్ల కిందటే అడిగారు. ఆంధ్రప్రదేశ్‌కు జగన్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. వై.ఎస్. జగన్ ఆదేశిస్తే కార్యకర్తగా ప్రచారం చేస్తా. రేపు లేదా ఎల్లుండి ప్రచారానికి నేను వెళ్లొచ్చు” అని వివరించారు. పదవి పై ఆశ లేదు. మోహన్‌ బాబు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos