న్యూ ఢిల్లీ: అయోధ్య వ్యాజ్యం వాదనలు అక్టోబరు 18న వాదనలు, విచారణను ముగిస్తామని అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం బుధవారం ప్రకటించింది. తీర్పు ప్రకటన వాయిదా పడే అవకాశం ఉంది. నవంబర్ 17న ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ పదవీ కాలం ముగియనుంది. ఆ లోగా తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఫిర్యాదుదార్లు మధ్య వర్తిత్వాన్ని కొనసాగించాలని కోరుకుంటే తమ కెలాంటి అభ్యంతరం లేదని ధర్మాసనం తెలిపింది.