న్యూ ఢిల్లీ: అయోధ్య భూ వివాద విచారణను గడువులోగా ముగించేందుకు మరో గంట పాటు ఎక్కువ పని చేస్తామని అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం శుక్రవారం వెల్లడించింది. వచ్చే సోమవారం నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాదనలు ఆలకిస్తామని వివరించింది. ‘సెప్టెంబరు 23 నుంచి మరో గంటసేపు ఎక్కువగా కూర్చుంటాం. రోజువారీ వాదనల సమయాన్ని సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు పెంచుతు న్నామ’ని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. విచారణను అక్టోబరు 18లోగా ముగిం చాలని ఇటీవల న్యాయస్థానం నిర్ణయించింది. గడువులోగా వాదనలు ముగిస్తే నవంబరు మధ్యలో తీర్పు వెలువడ వచ్చు.