కొరగాని మంత్రులు గాజులు వేసుకోవాలి

కొరగాని మంత్రులు గాజులు వేసుకోవాలి

ముంబై: ;పదమూడేళ్లు మంత్రిగా ఉండి కూడా ఏ పని చేయకపోతే ఆ వ్యక్తి గాజులు తొడుక్కోవడం ఉత్తమమని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించారు. అహ్మద్ నగర్ జిల్లా శ్రీగోండా నియోజక వర్గం శాసనసభ ఎన్నికల ప్రచార సభలో ఆయన గురువారం ప్రసంగించారు. భాజపా అభ్యర్తి, ఎన్సీపీ మాజీ నేత బాబన్రావు పచ్పుటే పై పవార్ నిపులు చెరిగారు. కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వంలో 13 ఏళ్ల మంత్రిగా పని చేసిన పచ్పుటే 2014లో బీజేపీలో చేరారు. కాంగ్రెస్-ఎన్సీపీ హయాంలో మంత్రిగా ఉన్నప్పటికీ తనను ఏ పని చేయనివ్వలేదని పచ్పుటే విమర్శలు చేశారు ‘పచ్పు టే ఇటీవల ఇక్కడ జరిగిన ఒక సభలో డుతూ.. తాను మంత్రిగా ఉన్నప్పుడు సంతకాలు చేయడం తప్ప ఏ పనిని చేయనివ్వలేదని తప్పు బట్టారు. మంత్రి సంతకాలు చేస్తేనే ఏదైనా ఉత్తర్వుగా మారుతుంది. క్షేత్ర స్థాయి పనులకు ఆమోదం లభిస్తుంది. సంతకాలు చేసీ ఏ పని చేయలేక పోయానని అనడంలో అర్థముందా? మంత్రిగా ఉండి కూడా ఏ పని చేయలేకపోతే ఆ వ్యక్తి గాజులు ధరించాలి’ అని ఘాటుగా వ్యాఖ్యా నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos