హెచ్‌సీఏలో 20 కోట్ల ఫ్రాడ్‌.. అజారుద్దీన్‌కు ఈడీ స‌మ‌న్లు

హెచ్‌సీఏలో 20 కోట్ల ఫ్రాడ్‌.. అజారుద్దీన్‌కు ఈడీ స‌మ‌న్లు

హైద‌రాబాద్: హైద‌రాబాద్ క్రికెట్ సంఘంతో లింకున్న మ‌నీల్యాండ‌రింగ్ కేసులో.. మాజీ క్రికెట‌ర్ అజారుద్దీన్‌కు ఇవాళ ఈడీ నోటీసులు జారీ చేసింది. 2020 నుంచి 2023 వరకు హెచ్‌సీఏలో జరిగిన అక్రమాలపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పలు ఫిర్యాదులు ఉన్నాయి. ఆ స‌మ‌యంలో హెచ్‌సీఏ అధ్య‌క్షుడిగా అజార్ ప‌నిచేశారు. క్రికెట్ బాల్స్, బకెట్ చైర్స్, జిమ్ పరికరాలకు కొనుగోళ్లలో అక్రమాలు జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఉప్పల్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఆర్ నమోదు చేసింది ఈడి. ఈ విషయం ఇప్పటికే అజారుద్దీన్ బెయిల్ పొందారు. అయితే తాజాగా విచారణ చేపట్టాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos