అయోధ్యలో తగ్గిన రద్దీ

అయోధ్యలో తగ్గిన రద్దీ

అయోధ్య : ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో గత వారం రోజులుగా భక్తుల రద్దీ భారీగా తగ్గి పోయింది. లోక్సభ ఎన్నికల ప్రకటనకు ముందు అయోధ్యలో నూతన రామ మందిరం ప్రారంభమైంది. అప్పటి నుంచి దేశ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అయోధ్యకు వెళ్లి బాల రాముడిని దర్శించుకున్నారు. దీంతో స్థానికంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారికి, రిక్షా డ్రైవర్లకు చేతి నిండా పని దొరికేది. అయితే, గత వారం రోజులుగా మాత్రం అయోధ్యలో భక్తుల రాక తగ్గిపోయిందని స్థానికులు చెప్తున్నారు. ఇంతకుముందు రామమందిరం, హనుమాన్గర్హి పరిసరాలు మొత్తం భక్తులతో కిటకిటలాడేవని, ఇప్పుడు భక్తుల సంఖ్య భారీగా తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమకు సరిగ్గా పని దొరకడం లేదని, వ్యాపారాలు నడవడం లేదని స్థానికులు వాపోతున్నారు. గతంలో ఎలక్ట్రిక్ రిక్షా నడపడం ద్వారా రోజుకు రూ.500 – రూ.800 వరకు వచ్చేవని, ఇప్పుడు రూ.200 – రూ.250 రావడం కూడా కష్టంగా ఉందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయోధ్య ఉన్న ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోవడమూ అయోధ్యలో రద్దీ తగ్గడానికి, వ్యాపారాలు మందగించడానికి ఒక కారణమని విశ్లేషకులు అంటున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos