
కడప: వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో
భాగంగా సోమవారం మధ్యాహ్నం లోక్‌సభ మాజీ సభ్యుడు అవినాశ్ రెడ్డిని ప్రత్యేక
దర్యాప్తు బృందం – సిట్ పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో ప్రశ్నించింది. వివేకానంద
రెడ్డి గుండె పోటుతో మృతి చెందారని అవినాశ్‌రెడ్డి వ్యక్తి గత సహాయకుడు రాఘవ రెడ్డి
సెల్ నుంచి పోలీసులకు ఫోన్ వచ్చినట్లు కడప
జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఇది వరకే తెలిపారు. తిరిగి కొంత సేపటికి అవినాశ్ కార్యాలయ ఉద్యోగి భరత్ రెడ్డి నుంచి కూడా
ఇదే విషయంపై ఫోన్ కాల్ వచ్చినట్లు కూడా చెప్పటం గమనార్హం.