వర్మ మరొకటి వదిలాడు…

  • In Film
  • March 7, 2019
  • 200 Views
వర్మ మరొకటి వదిలాడు…

ఎన్టీఆర్‌ రాజకీయ ప్రస్థానంలో ఎదుర్కోన్న ఆటుపోట్లు,వెన్నుపోట్లు,సంఘర్షణ ఇవేమి చూపించకుండా ఎవరో మోసం చేయడానికి ప్రయత్నిస్తే చంద్రబాబు ఎన్టీఆర్‌ను కాపాడినట్లు చూపించి చంద్రబాబును ఉత్తముడిగా చూపించడానికి ఎన్టీఆర్‌ మహానాయకుడు చిత్రాన్ని నిర్మించారు నందమూరి బాలకృష్ణ.స్వయాన వియ్యకుండు కావడం పైగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబును మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి బాలకృష్ణ తన వంతు కృషి చేశాడు.అయితే మేము చూపించిందే నిజమనుకోవాలంటూ ప్రజలను ఆదేశించలేరు కదా.అందుకే మహానాయకుడు అత్యంత భారీ డిజాస్టర్‌గా నిలిచింది.ఈ తరుణంలో వివాదాలతోనే సహవాసం చేసే దర్శకుడు తెరకెక్కించినర లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ తెదేపా నేతలను మాత్రమే కాదు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడును కూడా తీవ్రంగా కంగారెత్తిస్తోంది.కొద్ది రోజుల క్రితం విడుదలైన ట్రైలర్‌లో చూపించిన సన్నివేశాలు,అందుకు ప్రజల నుంచి సూపర్‌ రెస్పాన్స్‌ రావడంతో తెదేపాకు గుండెల్లో గుబులు మొదలైంది. తాజాగా వర్మ మరో పాటను యూట్యూబ్‌లో విడుదల చేశాడు. ఎన్టీఆర్ పక్కనే ఉండి గోతులు తీసినవారి గురించి వర్మ ఇందులో ఘాటైన సాహిత్యం రాయించాడు. అవసరం చుట్టే సమాజం తిరుగుతుందని అధికారం ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఒకలా నీడనిచ్చి చెట్టు మోడువారిన తర్వాత ఎవరికి ఉండదు అవసరం ఇలా లిరిక్స్ మొత్తం మంచి ఘాటైన భావజాలంతో సాగింది. గుండెల్లో గునపాలు దించి మనిషి పోయాక విగ్రహాలకు దండ వేయడం అవసరం అనే లైన్ వచ్చినప్పుడు చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసే షాట్ ని చూపించడం విశేషం. మొత్తానికి ఈ పాట ద్వారా తన ఉద్దేశాన్ని సినిమా ఎలా ఉండబోతుందనే క్లారిటీ కూడా ఇచ్చేశాడు వర్మ.విడుదలైన నిమిషాలలోనే దీనికి లైకులు కామెంట్లు హోరెత్తుతున్నాయి.ఇక విడుదలయ్యాక ఇంకెన్నప్రకపంనలు,సంచలనాలు,వివాదాలు సృష్టిస్తుందో చూడాలి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos