తెదేపాకు రాజీనామా చేసిన అవంతి…

తెదేపాకు రాజీనామా చేసిన అవంతి…

అంతా అనుకున్నదే జరిగింది.విశాఖ జిల్లా అనాకపల్లి ఎంపీ ముత్తంశెట్టి
శ్రీనివాసరావు అలియాస్‌ అవంతి శ్రీనివాస్‌ తెదేపాకు రాజీనామా చేయనున్నారంటూ వస్తున్న
ఊహాగానాలు నిజం చేస్తూ గురువారం తెదేపా పార్టీకి అంవతి శ్రీనివాస్‌ రాజీనామా చేసారు.బుధవారం
తెదేపాకు రాజీనామా చేసి అనంతరం హైదరాబాద్‌కు చేరుకొని వైసీపీ అధినేత జగన్‌ను కలుసుకున్న
చీరాల ఎమ్మెల్యే ఆంమంచి కృష్ణమోహన్‌ అనంతరం మీడియాతో తనతో పాటు మరికొంత మంది తెదేపా
కీలకనేతలు వైసీపీలో చేరనున్నారంటూ వ్యాఖ్యలు చేసారు. ఆమంచి మీడియా ముఖంగా ఈ వ్యాఖ్యలు
చేసిన కాసేటికే టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు అవంతి సిద్ధమైపోయారు.అప్పటి
నుంచి టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్న అవంతి త్వరలోనే వైసీపీలో చేరబోతున్నారంటూ ఊహాగానాలు
వినిపించసాగాయి.ఇవన్నీ నిజమేనన్నట్లుగా నేటి ఉదయం అవంతి తెదేపాకు రాజీనామా చేసేశారు.ఇప్పటికే జగన్ తో ఆయన ఫోన్ లో సంప్రదించినట్లుగా త్వరలో వచ్చి కలుస్తానని కూడా అవంతి చెప్పారట. ఈ విషయం నిజమేనన్నట్లుగా విశాఖ జిల్లాకు చెందిన వైసీపీ నేతలు ఉన్నపళంగా హైదరాబదాదు రావాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న అవంతి శ్రీనివాస్ కు ఏ మేర ప్రాధాన్యం కల్పించవచ్చన్న విషయాన్ని తేల్చేందుకే జగన్ విశాఖ జిల్లా నేతలను
హైదరాబాద్‌కు పిలిపించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే… టీడీపీకి రాజీనామా చేసేసిన అవంతి…  ఈ రోజు సాయంత్రం లేదా శుక్రవారం ఉదయం హైదరాబాదుకు
చేరుకొని జగన్ తో భేటీ కానున్నట్లు సమాచారం.అటుపిమ్మట అవంతి వైసీపీలో చేరడం దాదాపుగా ఖాయమన్న వాదన వినిపిస్తోంది. అధికార పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే రాజీనామాలు చేసి వైసీపీలో
చేరడంతో వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు ఎంపీ రాజీనామాతో మరింత వేడెక్కాయి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos