హోసూరులో ఆస్ట్రేలియా మహిళ దారి దోపిడీ

హోసూరులో ఆస్ట్రేలియా మహిళ  దారి దోపిడీ

హోసూరు : ఆస్ట్రేలియాకు చెందిన వృద్ధ మహిళను మంగళవారం అర్ధ రాత్రి ఓ ఆటోవాలా చితక బాది ఆమె వద్ద డబ్బు, పాస్‌పోర్టు గల బ్యాగును దారి దోచుకున్నాడు. బాధితురాలు హోసూరు ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం రావడంతో దారి దోపిడీ సంఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు అందించిన వివరాల మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆస్ట్రేలియా దేశానికి చెందిన రూథర్ అలెగ్జాండర్ (65) ఆరు నెలల కిందట టూరిస్ట్ వీసాపై ఇండియాకు వచ్చి తమిళనాడు రాష్ట్రానికి చేరింది. తమిళనాడులో వివిధ ప్రదేశాలను చుట్టిన రూథర్ అలెగ్జాండర్ వారం రోజులుగా కొడైకెనాల్‌లోని ఓ ప్రాంతంలో బస చేసి ఆ ప్రాంతాన్ని చూసి మంగళవారం బస్సులో సేలం మీదుగా బెంగళూరుకు వెళ్లడానికి హోసూరుకు చేరుకొంది. అర్ధ రాత్రి కావడంతో బెంగళూరుకు వెళ్లేందుకు బస్సులు లేనందున, హోసూరు నుంచి కర్ణాటక సరిహద్దు వరకు వెళ్లేందుకు హోసూరు బస్టాండు లో  ఆటో ఎక్కింది. ఆటోవాలా ఆమెను కర్ణాటక సరిహద్దు అత్తిపల్లి వద్ద దించాల్సి ఉండగా, ఆటోను దారి మళ్లించి హోసూరు రింగు రోడ్డు వైపు తీసుకెళ్లాడు. రింగు రోడ్డులో జనసంచారం, వాహన సంచారం అంతగా లేకపోవడంతో మహిళను చితక భాది ఆమె వద్ద ఉన్న 3 వేల నగదు, పాస్‌పోర్టు గల బ్యాగును లాక్కెళ్లాడు. అతి కష్టం మీద హోసూరు ప్రభుత్వాస్పత్రికి చేరుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు హోసూరు డీఎస్పీ మురళి రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos