పోలీసు పదవుల వేలం

పోలీసు పదవుల వేలం

లఖ్నవూ: పోలీసు శాఖలో బదిలీలు, పదోన్నతుల రాకెట్ రాజ్యమేలుతోందని ఉత్తర్ ప్రదేశ్ పోలీసు ఉన్నతాధికారి వైభవ్ కృష్ణ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్కు రాసిన లేఖలో ఆరోపించారు. పదవిని, ప్రదేశాన్ని బట్టి భారీ మొత్తాలు చేతులు మారుతా యని అందులో పేర్కొన్నారు. కాసులు కురిసే చోట పదవుల కోసం ఈ మొత్తాలను చెల్లిస్తారని వివరించారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నఐదుగురు ఐపీఎస్ అధికారుల పేర్లను పోలీసు డైరెక్టర్ జనరల్, ముఖ్యకార్యదర్శికి లిఖిత పూర్వకంగా తెలిపారు. మీరట్ ఎస్ఎస్పీ పదవికి గానూ ఒక ఐపీఎస్ అధికారి, దళారుల మధ్య రూ.80 లక్షలకు ఒప్పందం కుదిరినట్టు తెలిపే ఫోన్కాల్ రికార్డింగులు, వాట్సాప్ సంభాషణలను గురించీ కూడా వివరించారు. ఆగ్రా ఎస్ఎస్పీ పదవికి రూ. 50 లక్షలు, బరేలీ ఎస్ఎస్పీకి అయితే రూ. 40 లక్షలు బిజ్నోర్ ఎస్పీ పదవి ఖరీదు రూ.30 లక్షలు పలుకుతోందని తెలిపారు. అత్యంత పకడ్బం దీగా ఏర్పాటైన ఒక ముఠా ఈ అక్రమాల్ని నడుపుతోందని వెల్లడించారు. ఈ వివరాల్ని బయట పెట్టినందుకు ఆ ము ఠా సభ్యులు తన పై దాడి చేస్తున్నరని చెప్పారు. స్వతంత్ర, స్వేచ్ఛాయుత వాతావరణంలో విచారణ జరిగేందుకు దర్యాప్తు బాధ్య తను నొయిడా పోలీసులకు బదులుగా హాపుర్ పోలీసు అధికారులకు అప్పగించినట్లు డిజిపి చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos