మహిళపై కర్రతో దాడి.. రక్షించకపోగా వీడియోలు తీసిన జనం

మహిళపై కర్రతో దాడి.. రక్షించకపోగా వీడియోలు తీసిన జనం

భోపాల్: మధ్యప్రదేశ్ లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ మహిళపై కొందరు వ్యక్తులు దారుణంగా దాడి చేశారు. అందరూ చూస్తుండగానే కర్రతో విచక్షణారహితంగా దాడి చేసి కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ధార్ జిల్లాలోని తండా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మోదీ 3.0 కేబినెట్లో కేంద్ర మంత్రిగా నియమితులైన సావిత్రి ఠాకూర్ స్వగ్రామంలో ఈ ఘటన వెలుగు చూడటం గమనార్హం. మహిళను కొందరు వ్యక్తులు అందరూ చూస్తుండగానే కర్రతో దారుణంగా కొట్టారు. నలుగురు వ్యక్తులు మహిళను పట్టుకోగా ఓ వ్యక్తి బలమైన కర్రతో కొడుతూ కనిపించాడు. ఈ దాడిలో తనను కాపాడండి అంటూ ఆ మహిళ ఎంత వేడుకున్నా ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. పైగా ఈ తతంగాన్నంతా తమ సెల్ఫోన్లలో చిత్రీకరిస్తూ చోద్యం చూశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియోపై పోలీసులు స్పందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. మహిళపై దాడి చేసిన ప్రధాన సూత్రధారి నర్సింగ్గా గుర్తించారు. అతను గంధ్వానీలో గల కోక్రికి చెందిన వాడని ధార్ జిల్లా ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు. ఈ ఘటనకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని ధార్ జిల్లా ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos