న్యూఢిల్లీ: ‘ఏ పనైనా ఎనిమిది రోజుల్లో పూర్తవ్వాలి. లేదంటే మిమ్మల్ని (ఉద్యోగులు) కొట్టమని ప్రజలకు చెబుతాన’ని భాజపా సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగుల్ని హెచ్చరించారు. ప్రజల అవసారాలు, కోపాన్ని గ్రహించి, వారికి కావల్సిన పనులు సత్వరమే చేయాలని ప్రభుత్వ ఉద్యోగులను సూచించారు. నాగపూర్లో లఘు ఉద్యోగ్ భారతి సంస్థ నిర్వహించిన ఆర్‌టీఓ అధికారుల కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.‘అధికారులు లంచాలకు మరిగారు. వారి ముఖం చూసి నేను ఇట్టే చెప్పలగలను. మీరు ప్రజల సేవకులం. నేను ప్రజలచేత ఎన్నుకోబడిన నాయకుడిని. మనం ప్రజలకు జవాబు దారీగా ఉండాలి. ప్రజా సమస్యలకు ఎనిమిది రోజుల్లో పరిష్కారం చూపాలి. లేదంటే మిమ్మల్ని కొట్టమని వారికి చెబుతాను’ అని హెచ్చరించారు.