దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గాయకుడి పై కేసు

దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గాయకుడి  పై కేసు

గాంధీనగర్: దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జానపద గాయకుడు యోగేశ్ గద్వి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దళితులపై పలుమార్లు అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు విశాల్ గర్వ అనే దళిత హక్కుల కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు వివరించారు. కచ్ జిల్లా బుజ్లో ఆదివారం భీంరత్న సమ్రాస్ కన్య విద్యాలయ బాలికల హాస్టల్ ప్రారంభోత్సవ సందర్భంగా నిర్వహించిన సంగీత కచేరి లో దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశా రు.కార్యక్రమానికి హాజరైన దళిత నేతలు గద్విని అడ్డుకుని మందలించారు. తమ బిడ్డల కోసం నిర్మించిన హాస్టల్ ప్రారంభోత్సవంలో ఇలాంటి వ్యాఖ్యలేంటని ఆగ్రహించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos