భారత్-పాక్ మధ్య ‘అణు’ సమాచార మార్పిడి

భారత్-పాక్ మధ్య ‘అణు’ సమాచార మార్పిడి

న్యూ ఢిల్లీ: భారత్-పాక్ పరస్పరం బుధ వారం కీలక సమాచారాన్ని పంచుకున్నాయి. రెండు దేశాల్లోని అణు స్థావరాలు, సంబంధిత కట్టడాల వివరాల్ని ఇచ్చిపుచ్చుకున్నాయి. రెండు దేశాల్లోని అణు స్థావరాలపై పరస్పర దాడిని నిరోధానికి కుదిరిన ఒప్పందంలో భాగంగానే ఈ మార్పిడి జరిగినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దౌత్య మార్గాల ద్వారా బుధవారం ఏకకాలంలో పరస్పర మార్పిడీలు జరిగినట్లు వెల్లడించింది. అణు స్థావరాల సమాచారాన్ని పంచుకునేలా 1988, డిసెంబర్ 31న రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. 1991, జనవరి 27 నుంచి అమల్లోకి వచ్చింది. దరిమిలా గత 29 ఏళ్లుగా నూతన సంవత్సరం మొదటి రోజు ఈ సమాచార మార్పిడి జరుగుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos