స్వాతంత్య్ర వేడుకల్లో అతిషి జాతీయ జెండాను ఎగరవేస్తారు

స్వాతంత్య్ర వేడుకల్లో అతిషి జాతీయ జెండాను ఎగరవేస్తారు

న్యూ ఢిల్లీ: ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో తనకు బదులుగా మంత్రి అతిషి పాల్గొంటారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాశారు. ఆగస్టు 15న తన స్థానంలో అతిషి జాతీయ జెండాను ఎగరవేస్తారని తెలిపారు. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించింది. ఏటా ఆగస్టు 15 వేడుకల్ని ఢిల్లీ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందన్న విషయం తెలిసిందే. ఛత్రసాల్ స్టేడియంలో జరిగే ఈ వేడుకల్లో కేజ్రీ జాతీయ జెండాను ఎగరవేసి.. సభను ఉద్దేశించి ప్రసంగించేవారు. మద్యం కుంభకోణం కేసులో ఆయన తీహార్ జైల్లో ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos