వర్షం ధాటికి పేలిన ట్రాన్స్‌ఫార్మర్‌..

వర్షం ధాటికి పేలిన ట్రాన్స్‌ఫార్మర్‌..

అంఫన్‌ తుఫాన్‌ ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌,ఒడిశా రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి.ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో తుఫాన్‌ ప్రభావంతో మరింత తీవ్రంగా ఉంది.భారీ వర్షానికి రాష్ట్రంలోని పలు జిల్లాలు నీట మునిగిపోగా బెంగాల్‌ రాజధాని కోల్‌కతా సైతం జలదిగ్బంధనంలో చిక్కుకుంది. ఉరుములు, మెరుపులతో కూడిన కుంభవృష్టి, వీచిన పెనుగాలకు వేల సంఖ్యలో భవనాల అద్దాలు పగిలిపోయాయి. కోల్ కతా నగర వ్యాప్తంగా 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఇదే సమయంలో బిల్డింగ్ బాల్కనీ నుంచి పేలుతున్న ఎలక్ట్రిక్ ట్రాన్స్ ఫార్మర్ వీడియోను చిత్రించగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. దక్షిణ కోల్ కతాలోని అన్వర్ షా రోడ్ లో ఘటన జరిగింది. భారీ శబ్దాలు చేస్తూ, కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతులను వెదజల్లుతూ ట్రాన్స్ ఫార్మర్ పేలింది. ఎంతో మంది అంఫాన్ కారణంగా తమకు ఎదురైన అనుభవాలను, దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో, అవి వైరల్ అయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos